21, మార్చి 2016, సోమవారం

మొన్న చెప్పినట్లు కొత్త కోర్సు షురూ  చెయ్యాలంటే కొత్త బిల్డింగ్ కట్టే అవసరం లెదనుకున్నం గదా.  హైదరాబాద్ల  ముందే జాగ లెదాయె.  మొన్న టీవీల సూపియ్యవట్టిండ్రు.  రానున్న రొజుల్ల  హైద్రాబాద్  పబ్లిక్ రొండు మూడు కోట్లు గావచ్చట.  గట్లయితే మరి గంతమందికి ఇండ్లు, నీల్లు, రోడ్లు, దావఖానలు, ఇస్కూల్లు, అబ్బో ఇట్ల జెప్పుకుంట వోతే  ఎన్నన్న చెప్పచ్చు. అదిగాదు ముచ్చట.  రెపటినాడు మన పోరగాండ్లకు ఏం మిగిలిస్తున్నం. ఒక్క శెట్టన్న, ఆడుకుంతదుకు గింత మాఇడానమన్న, కనీసం గాలికొసం  గొంత పచ్చదనమన్న మిగుల్తదా లేదా?