21, మార్చి 2016, సోమవారం

తెలంగాణా సోదరులకు నమస్కారాలు
ఈ బ్లాగును వాడక దాదాపు సంవత్సరం దాటింది.  అందుకు మమ్మల్ని క్షమించ మని ప్రార్థన.  ఇక నుండి కనీసం వారానికో లేక పదిహేను రోజులకో బ్లాగును అప్ డేట్ చేయడానికి ప్రయత్నిస్తాం.

ఇవ్వాల్టి కొత్త ఆలోచన:
ఈ సారి వర్షాలు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా.  ప్రభుత్వం కూడా కరువును ఎదుర్కొనడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది.  మన తెలంగాణా సముద్ర మట్టానికి చాల ఎత్తులో ఉంది కాబట్టి నీటి సమస్య మనల్ని ఎప్పుడూ వెంటాడుతు నే ఊంటుంది. లిఫ్ట్ ఇరిగేషన్ మనకు తప్పదు. కాబట్టి సౌర శక్తిని ఎత్తి పోతల పథకాలకు ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది .  అలాగే  రిసైకిల్డ్ నీటిని వాడుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటినుంచే మొదలు పెట్టాలి.  ఎందుకంటే రిసైకిల్డ్ నీటిని ఉపయోగించుకోవడానికి ప్రజలు మానసికంగా సిద్ధంగా లేరు.  కాబట్టి  ప్రజలు నీటి పునర్వియోగానికి మానసికంగా సిద్ధం చేయడానికి ప్రయత్నాలు  ఇప్పటినుంచే ప్రారంభించాలి.