పేజీలు

15, జూన్ 2016, బుధవారం



హలో ఫ్రెండ్స్


మల్లో సారి మిమ్మల్ని గలవాలనిపించించి. అందుకే గీ ఉత్తరాన్ని పోస్ట్ చేస్తున్న. ఈ యేడన్న జర వానలు మంచిగ వడ్తె మంచిగుండు. మీ కో సంగతి చెప్పాల. మన తెలంగాణా మన చుట్టు పక్కల రాష్ట్రాలకంటే కొంచం ఎత్తుమీద ఉన్నదాయె. అందుకని మనం నీల్ల కొసం ఏదో కొత్త ప్లాన్ ఎస్కొవాలె. తప్పదు. ఇంతకు ముందు గూడ ఈ మాట జెప్పిన మల్ల జెప్తున్న. వాడిన నీల్లనే మల్ల వాడాల. ఛీ పాడుగాను! అంట్లుతొమిన నీల్లు, బట్టలుతికిన నీల్లు మల్ల మల్ల వాడాల్నా? చీ చీ. అది తల్సు కుంటేనే యాక్కు! వాంతికస్తున్నది అనుకుంటున్నరా. మీకు అసలు ముచ్చట చెప్పనా? మనకు వానలు ఎట్ల పడుతున్నయునుకుంటున్నరు. ఒక రకంగ వానలు కుడా రీ సైకిల్డ్ నీల్లే. జపాన్ల ప్రతి నీటి సుక్కను 5 సార్లు వాడతరట. అమెరికా ల గూడ 4 సార్లు వాడతరట. వాన వడ్డప్పుడు ప్రతి బొట్టు కాపాడుకోవాల. అట్లనే ఉన్న నీల్లను మల్ల మల్ల వాడి పొదుపు జెయ్యాలె. యాదివెట్టుకోండ్రి ఇయ్యాల గాక పోతె రేపు మనం నీల్లను రీ సైకిల్ జెయ్యక తప్పదు.  మన పోరగాండ్లు రేపటి దినం   భూమ్మీద మంచిగ బతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలని గుర్తువెట్టుకోండ్రి సుమా! 

కామెంట్‌లు లేవు: