పేజీలు

27, ఆగస్టు 2020, గురువారం

 ఐడియా ఒక మిత్రుడిది  అక్షరీకరణం నాది. ఆయన కోరిక మేరకు ఫేస్ బుక్ లో లింక్ ఇస్తున్నాను.  నిజానికి దీన్ని 2016 లోనే ఈ బ్లాగులో పోస్ట్ చేయడం జరిగింది - ప్రదీప్

 

గ్రామాలను కాపాడుకుంటూనే పట్టణీకరణ సాధ్యమేనా ? !

పట్టణీకరణం సాధరణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కనిపించే  ఒక అనివార్య దశ అని చాలామంది భావిస్తారు  .  అయితే ఇది  నాణానికి ఒక వైపు చిత్రం మాత్రమే.  నిజంగా ఇది అనుకున్నంత పెద్ద సమస్య కాదు. ఈ మధ్య ఒక ఒక కొత్త ట్రెండ్ మొదలయ్యింది.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉద్యోగాలను పట్టణాలను వదిలి గ్రామాలకు రివర్స్ వలస పోతున్నారు. 

గ్రామాలను అభివృద్ధి వైపా? లేక అభివృద్ధిని  గ్రామాల  వైపా ?  
Should Development  lead towards Village ? Or should Village lead Towards Development?


         పై రెండు ప్రశ్నలు ఒకటే కదా అనిపిస్తుంది.  కానీ సూక్షంగా చుస్తే చాలా తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక ఏ అదిలాబాద్ జిల్లా  లోనో, నిజామాబాద్ లోనో  ఒక మారుమూల గ్రామాన్ని తీసుకుందాం.  ఆ గ్రామం జిల్లా రాజధానికి (హెడ్ క్వాటర్) 30 కిలోమీటర్ల దూరంలొ ఉందనుకుందాం. అ గ్రామ జనాభా 5 నుండి 10 వేలు అనుకుంటే  ఆ గ్రామానికి కనీస  సౌకర్యాలు అంటే విద్యుత్తు, రోడ్డు  వంటివి కల్పించడం  పెద్ద సమస్య కాదు. కానీ ఒక కార్పొరేటు హాస్పటల్ ఒక డిగ్రీ కాలేజ్, పిజి కాలేజ్, లాంటివి   కల్పించండమంటేనే సమస్యలొస్తాయి. 5, 10 వేల జనాభా కోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలంటే ఏ ప్రభుత్వమైనా కొంచం ఆలోచిస్తుంది.   సాధారణంగా బతుకుతెరువు , ఉద్యొగం, పిల్లల చదువులు, వైద్య అవసరాలు గ్రామీణులను పట్టణాల  వైపు లాగుతున్నాయి. అన్ని రకాల అభివృద్ధి ఫలాలను ప్రతీ గ్రామానికి మోసుకెళ్ళడం కంటే కొన్ని గ్రామాలను అభివృద్ధి వైపుకు మళ్లించడం సులభం అనిపిస్తుంది.  అదెలాసాధ్యమో చూద్దాం.  

        ప్రతీ మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ మండలంలోని ప్రతి గ్రామం లోని ప్రతి  కుటుంబానికి మండల కేంద్రంలో (మండల హెడ్ క్వార్టర్లో) గృహ సౌకర్యం కల్పిస్తే  ప్రజలను గ్రామం తో తమకున్న అనుబంధాన్ని కొనసాగిస్తూనే వారి  కుటుంబాలను బస చేయించ వచ్చు. ఇప్పడు కడుతున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రతి మండల హెడ్ క్వార్టర్ లలో అపార్ట్మెంట్ ల లాగా మల్టి స్టోరీ  గృహల  నిర్మాణం చేసి ఇవ్వవచ్చు.    అన్నిగ్రామాల ప్రజలకు మండలంలో చోటు కల్పించడంతొ మండలాల సైజు పెరిగి అవి మధ్య రకం పట్టణాలుగా రూపాంతరం చెందుతాయి. అప్పుడు గ్రామాలను కేవలం వ్యవసాయ కార్య కలాపాలకు మాత్రమే పరిమితంచేయవచ్చు. ఇక ఈ కాలంలో రవాణా సౌకర్యాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే సగం కంటే అధిక జనాభాకు స్వంత వాహనాలు (కనీసం ద్విచక్ర వాహనాలు) ఉన్నాయి.  కాబట్టి గ్రామానికి పట్టణానికి మధ్య రాక పోకలకు పెద్ద సమస్య ఉండక పోవచ్చు. లేదా పబ్లిక్ రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయవచ్చు.  అప్పుడు  మధ్య రకం నగరాలుగా మారుతున్న మండల హెడ్ క్వార్టర్లలొ అన్ని రకాల సివిక్ సౌకర్యాలతో పాటు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ఫలాలను అందరికి అందుబాటులో తేవచ్చు. 
         అందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలు ఇలా ఉండాలి. 
1.  ప్రతిమండలంలొ ప్రభుత్వ భూములను గుర్తీంచి వాటిలో పేదలకు ఉచిత లేక నామమాత్రపు ధరలకు గృహ వసతి కల్పించాలి. అవి అనివార్యంగా ఫ్లాట్ల (మల్టీ స్టోరీ బంగళాలలో ఒక రెండు  గదుల వసతి మాత్రమే కల్పించాలి.  కాస్త ఆర్ధిక స్తోమత ఉండి స్వంత, స్వతంత్ర (ఇండిఫెండెంట్) ఇల్లు కట్టుకోగలవారికి వంద గజాల స్థలం వరకు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలలొ సగం కానీ అంతకెంటే వీలయితే ఇంకా తక్కువకు రిజిస్ట్రేషన్ చేసిచ్చే వీలు కల్పించాలి.  అంత కంటే ఎక్కువయితే  రిజిస్ట్రేషన్ చార్జిలను రెట్టింపు చెయాలి.  ఎందు కంటే  గృహ అవసరాలకోసం  భూమలవినియోగాన్ని తగ్గ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక ఎకరాలకు ఎకరాలు, వేల గజాల జాగా కొద్ది మంది కబ్జాలో ఉండి అనవసరంగా భూముల ధరలను పెంచుతున్నారు. వారి బారి నుండి భూమిని విముక్తం చేసి దాన్ని అందరికి అందుబాటు లోకి తెవడానికి వివక్ష పూరిత రిజిస్త్రేషన్  చట్టం (Discriminating Registration Rules)  రూపొందించాల్సిన అవసరముంది.  ఇటువంటి చట్టాలు హైదరాబాద్ వంటి నగరాలకు సైతం వర్తించేలా చూడాలి. ఈ మొత్తం వ్యాసం ఉద్దేశాన్ని తక్కువ మాటల్లో ఇలా చెప్పుకోవచ్చు 
 " గ్రామాలను కేవలం వ్యవసాయానికి పరిమితం చేసి, గ్రామస్థుల కు పట్టణాల్లో నివాసానికి అనుకూల వాతావరణం  కల్పిస్తే ,  పట్టణాలను గ్రామాల పక్కనే అభివృద్ధి చేస్తే గ్రామాలను కాపాడుకుంటూనే పట్టణీకరణ సాధ్యమే !
 

కామెంట్‌లు లేవు: