పేజీలు

10, సెప్టెంబర్ 2016, శనివారం

Pavan Kalyan can achieve Telangana as easily as shaving.

గడ్డం గీసుకున్నంత సులభంగా రాష్ట్రాన్ని విభజించారు. -  పవన్ కళ్యాణ్ 

Image result for pavan kalyan images


తెలంగాణా  సాధించడం పవన్ కు  చాలా తేలిక.  
ఆ సంగతి మనకు తెలీక  
మనం అనవసరంగా అరవై ఏళ్ళు కష్ట పడ్డాం. 
పవన్  గడ్డం గీసుకున్నంత ఈజీగా సాధించే వాడు 

తెలంగాణా  సాధించడం పవన్ కు  చాలా తేలిక.  
ఆ సంగతి మనకు తెలీక 
వేయ్యి మంది  పోరగాండ్లను  పోగుట్టుకున్నాం
పవన్  గడ్డం గీసుకున్నంత ఈజీగా సాధించే వాడు

తెలంగాణా  సాధించడం పవన్ కు  చాలా తేలిక.  
ఆ సంగతి మనకు తెలీక 
సకల జనులు 42 రోజులు సమ్మె జేసిండ్రు 
పవన్  గడ్డం గీసుకున్నంత ఈజీగా సాధించే వాడు

తెలంగాణా  సాధించడం పవన్ కు  చాలా తేలిక.  
ఆ సంగతి  తెలీక 
కేంద్రం ప్రణబ్ కమిటీ వేసింది 
అదే పవన్ అయితే  గడ్డం గీసుకున్నంత ఈజీగా సాధించే వాడు

తెలంగాణా  సాధించడం పవన్ కు  చాలా తేలిక.  
ఆ సంగతి  తెలీక 
కేంద్రం శ్రీకృష్ణ కమిటీ వేసి కాలయాపన జేసింది 
పవన్  గడ్డం గీసుకున్నంత ఈజీగా సాధించే వాడు

రాష్ట్ర విభజనను అడ్డుకోవడం   పవన్ కు  చాలా తేలిక.  
ఆ సంగతి  తెలీక 
లగడపాటి పెప్పర్ స్ప్రే తో పార్లమెటులో గబ్బు లేపిండు 
అదే పవన్  గడ్డం గీసుకోకుండా విభజనను ఆపేవాడు 
ఎందుకంటే ఆయనకు తెలంగాణా సాధించండం 
పవన్కు   గడ్డం గీసుకున్నంత ఈజీ 





కామెంట్‌లు లేవు: