పేజీలు

2, ఆగస్టు 2014, శనివారం

New Education Policy

 నూతన విద్యావిధానం 

        ముఖ్య మంత్రి  కే.సి. ఆర్ పదే పదే కేజి నుండి పీజీ వరకు ఉచిత విద్య గురంచి ప్రస్తావిస్తున్నారు. మంచి ఆలొచనే.  కాదనడానికి లేదు.  కానీ ఇందులో కొన్ని పాలనా పరమైన, ఆర్ధిక ఇంకా కొన్ని  సామాజిక  పరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. 

         మొదటగా  ప్లస్ 2 (ఇంటర్ మీడియట్ )  వరకు ఉచిత విద్య ఖచ్చితంగా కొనసాగాల్సిందే. ఆ తర్వాతే సమస్య. యూ. జి . సి. ఇటివల తీసుకొస్తున్న ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం   స్పష్టంగా  కనిపిస్తున్నది. యునివర్సిటి గ్రాంట్స్ కమీషన్, దాని అనుబంధ సంస్థ  NAAC, ప్రతిపాదిస్తున్న కార్యక్రమ సరళి బట్టి చూస్తె ఉన్నత విద్యాసంస్థలు అంటే అండర్      గ్రాడ్యుయేషన్, ఆపైన  కోర్సులకు  సంబంధించిన విద్యాసంస్థలు తమ మనుగడ కోసం అవసరమైన నిధులను తామే సమకూర్చుకోవల్సిన సమయం ఆసన్నమైనట్లుగా అనిపిస్తుంది.  ఒకవేళ యూ. జి.సి, లేక కేంద్ర ప్రభుత్వ విధానం కూడా అదే అయితే విద్యాసంస్థలు తమ మనుగడకోసం తప్పని సరిగా విద్యార్ధుల ఫీజుల పైనే అధారపడాల్సి వస్తుంది. అప్పుడు విద్యార్థులు తప్పనిసరిగా  తమ విద్యా సంస్థల భారాన్ని      కొంత మోయక తప్పదు. అందుకే ఈ వ్యాసం(విద్యార్థుల ) నినాదం " విద్య  సమాజం ఇచ్చే దానం కాదు - విద్య ప్రతి  విద్యార్థి  హక్కు"కావాలి.  అందుకోసం ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి 

1.  డిగ్రీ విద్యార్థులకు పార్ట్ టైం ఉద్యోగాలు కల్పించాలి . 
2.  25 నుండి 40 శాతం వరకు ప్రైమరీ స్థాయి  ఉపాధ్యాయుల పోస్టులను 
     డిగ్రీ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి. 
3.  వారికే శిక్షణ ఇచ్చి వారి సేవలను మాత్రమే ఉపయోగించుకోవాలి. 
4.  ఈ టీచర్  విద్యార్థులకు పిరియడ్ కు కొంత మొత్తాన్ని చెల్లించాలి. 
5. అందులోనుండే ఆ విద్యార్థి తన చదువు కు కావలసిన డబ్బులను 
    సంపాదించుకోవాలి  అంటే పోషణ, గృహవసతి భారాన్ని  తల్లిదండ్రులు

భరిస్తారు ఇక చదువుకు అవసరమైన ఖర్చులలో కొంత తన స్వంత సంపాదన పై ఆధార పడవచ్చు.   మొత్తం మీద విధ్యార్థుల మనస్సుల్లోనుంచి ఉచిత విద్య భావనను పూర్తిగా తుడిచి వెయ్యాలి.  పైగా దేశ భవిష్యత్తుకు మూల కారకులైన యువత తమ  జీవిత కీలక దశలో, అంటే 16 సంవత్సరాల వయసు నుండి 25 సంవత్సరాల వయసు వరకు  వారి మనసిక, శారీరక శక్తి యుక్తులను ఉపయోగించుకొవాలంటె ఆ దశలో వారిని చదువుకు, పనికి రెండింటికి ఉపయోగించుకోవాలి. విదేశాలలో చదువుకునే మన విద్యార్థులు  చాలా మంది ఒక వైపు చదువుకుంటూనే, తమ ఖర్చుల కోసం డబ్బులు సంపాదించుకుంటున్నారు.  మరికొంత మంది తమ చదువులకు, ఇతర  అవసరాలకు కావలసిన డబ్బులతో సంపాదించడంతో  పాటు కొంత సొమ్మును ఇంటికి కూడా పంపిస్తున్నారు.   చాలా దేశాల్లో నిర్ణిత వయసు దాటినా యువతీ  యువకులు తప్పనిసరిగా తమ బతుకు తాము బతకాలసిందే.  ఉదాహరణకు అమెరికా లో 14 సంవత్సరాలు పిల్లలు సంపాదనలో పడతారు. అలాగే మన దేశం లో కూడా ఉన్నత విద్యను ఉచితంగా కాకుండా వారి కష్టం తో నే చదివేలా చేయగలిగితే ఎలా ఉంటుందో ఆలోచించాలి.  ఏదో ఒక పార్ట్  టైం ఉద్యోగం కల్పించి తద్వారా వచ్చిన పైకంతో కనీసం ఫీజులు కట్టుకునేలా చేయగలిగితే చదువు విలువ తెలుస్తుంది.  ఊరికే వచ్చిన చదువుల  పట్ల విద్యార్థులకు సరైన అవగాహన లేకుండా  ప్రభుత్వం కల్పించిన స్కాలర్ షిప్పులు, ఇతర సదుపాయాలను దుర్వినియోగం చేస్తున్నారు.  కాబట్టి స్కాలర్ షిప్పుల కు బదులు పార్ట్  టైం ఉద్యోగాలు కల్పిస్తే విద్యా వ్యవస్థ తీరు మారే అవకాశం ఉంది.  
  







కామెంట్‌లు లేవు: