పేజీలు

9, ఆగస్టు 2014, శనివారం

Management of Government and Private Infrastructure

కొత్త విద్యాలయం  ప్రారంభించాలంటే కొత్త  భవన నిర్మాణం  చెయాల్సిందేనా?
అప్పుడప్పుడు నాకో అనుమానమొస్తది.  కొత్త్తగా ఒక స్కూలో, లేకపోతె ఒక కాలేజో షురూ జేయ్యలంటే కొత్త బిల్డింగ్ కట్టాల్సిందేనా?.  ఒక చిన్న మాటచెప్త.   నేనొక  గౌర్మెంట్  కాలేజీల లచ్చరర్ పనిజేస్త.  ఆ కాలేజి యాడాది మొత్తంల 200 దినాలు పనిజేస్తది అదికూడా రోజుకు 8 గంటలు.  ఇది ఎంత అన్యాయమో  సూద్దామా ? ముందుగల్ల ఆ బిల్డింగ్ ప్రజల పైసలతోని  కట్టిందన్న ముచ్చట మరువద్దు.  మా కాలేజీల 40 దాక రూములు, ఐదారు వందల బెంచీలు కుర్శీలు, ఫాన్లు, కంప్యూటర్లు ఇట్ల కోట్ల  రూపాయల సామాను  ఉంటది.  కానీ దాన్ని యాడాదిల 200 రోజులు, రోజుకు 8 గంటలు లెక్కల ఇస్తమాల్ జేస్తే అంత నష్టమే గాని ఎమన్నా ఫాయిదా ఉన్నదా?  ఒక్క సారి లెక్క జేసి సూద్దాం! అసలు యాడాదికి ఎన్ని  గంటలుంటయో  తెల్సా ?  365 X 24 = 8760 గంటలు . అసుంటిది మనం వాడుకుంటున్నది  200 X 8 = 1600  గంటలు.  ఇంటుంటె  గమ్మతనిపిస్తున్నది గదా!  గమ్మతు గాదు. నెం జెప్పేది నిదానంగా ఆలొచన జెయ్యిండ్రి, మీకే  అర్దమైతది. ఆ రూములు, బెంచీలు, కుర్చీలు , కంప్యూటర్లను రోజుకు కనీసం 16 గంటలు వాడుకోవచ్చు.  అట్లనే యాడాదికి కనీసం 300 రోజులు వాడుకుంటే  4800 గంటలు  పనిజేసినట్లుంటది. ఇప్పుడు ఇన్ఫోసిస్, విప్రో కంపీనీలు గట్లనే పనిజేస్తున్నాయి గదా? గట్లనే మనంకూడా పనిజేద్దాం !   ఇంక మా ఊళ్ళే  ఐదారు ప్రైవేటు డిగ్రీ కాలేజిలు, జూనియర్ కాలేజీలున్నాయి.  అవ్వి గూడ గట్లనే పనిజేస్తయి.  పాపం లక్షలు ఖర్చు వెట్టి కాలేజీలు స్కూల్లు  పెడ్తరు. మల్ల అంత  పోగోట్టుకుంటరు.  అందుకని వాల్లక్కూడ ఈ మం త్రం పనిజెస్తది. ఓ ప్రైవేటు కాలేజీల స్కూల్ల దొరలూ!  మీరు కూడ  మీ బిల్డింగులను రోజుకు 24 గంటలు గాక పోయినా కం సే కం  16 గంటలు పనిజేసేటట్లు సూడుండి.  మీకు,  మీ సుట్టూ  ఉన్నోల్లకు  లాభం జేసినట్లయితది.  గప్పుడే మన తెలంగాణ ముందుకు వోతది ,  అందుకేంజెయ్యాల్నో జెప్త.

అన్నలూ ఇగ  షురూ  చేద్దామా ?  ప్రతి కొత్త ఆఫీసుకు, ప్రతీ కొత్త కాలేజి, స్కూలు  ఏది మొదలు వెట్టిన ప్రతీసారి కొత్త బిల్డింగ్ కట్ట మంటే పైసల్  మస్తు గావాల్నాయ్. పోనీ దాన్ని పూర్తిగా వాడుకుంటమా అంటే అదీ లేదు.
గిట్లయితే ఎట్ల.  అందుకే ఇప్పుడు ఎట్ల జయ్యాలె ఎం జెయ్యాలె చెప్త.  ఉదారణకు,  నేను చిన్నప్పుడు సదువుకున్న ఇస్కూలు సంగతి సూద్దాం. నేను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిల్లా పరిషత్ హై  స్కూల్ల పదవ తర్గతి పాసైన. నిజంగానే గా స్కూలును జూసినప్పుడల్ల నాకు మస్తు బాధనిపిస్తది.  నా అసుంటోల్లకు  వందల వేల మందికి సదువు జెప్పి ఒక దారి సూపిచ్చింది.  పేద్ద మైదానం. మల్ల ఊరు నడిమిట్ల ఉన్నది.  అదే బిల్డింగ్ ను ఇంకా పెద్దగ జేసి వంద రూములు ఇయ్యాల కొత్తగచ్చిన కంప్యూటర్లతోని పాఠం చెప్పిచె   LED ప్రొజెక్టర్లు ఇంకా, పెద్ద ఆన్ లైన్ లైబ్రరి, ఇంక కావల్సిన అన్ని ఇవ్వాలె.  దానికొక  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను పెట్టాలె. పొద్దుగాల్ల 4నుంచో 5నుంచో  క్లాసులు షురూ  చేస్తే రాత్రి పది దాక ఎవ్వల్లు కావాలంటే వాల్లు దాన్ని వాడుకోనేతట్లు  చెయ్యలే.  ఒక కాలేజో లేక పొతే ఒక స్కూలొ  తక్కువ టైం లో పూర్తయ్యే సర్టిఫికేట్ కోర్సులో ఇట్ల ఎంతన్న వాడుకోవచ్చు. గట్లనే అన్ని ప్రైవేటు బిల్డింగులు కూడా తాయారు గావాలె.  అప్పుడు కొత్త కోర్సులు కావాలంటే ఎందుకు రావు. ఉద్యోగాలు దొరుకు మంటే ఎందుకు దొర్కవు .  అన్ని అవుతయి.  అర్ధమయిందా నేను చెప్పింది.   మరి ఇయ్యాలటికీ జై తెలంగాణా!














కామెంట్‌లు లేవు: