పేజీలు

16, జూన్ 2016, గురువారం



ముందుగా  ఒక విన్నపం
పాఠకులు దయచేసి ఒక బ్యూరొక్రాటు  అలోచించినట్లుగా సాక్ష్యాలు అధారాలు ఉన్నాయా? అసలు ఈ వ్యాసం ఏ కోవలోకి వస్తుంది? ఇది పరిశోధనా పత్రమా? లేక మరొకటా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం  చేయకండి. ఒక  ప్రభుత్వ పాలన శాస్త్ర అధ్యాపకుడుగా, ఉద్యోగ పర్వ చివరి దశలో పాలకుడిగా నేను గమనించిన విషయాలు, పాలకుడిగా నాకు ఎదురైన అనుభవాలు నన్ను ఈ వ్యాసం రాయడానికి పురికొల్పిన శక్తులు. వాటినే  మీతో పంచుకొంటున్నాను. ఇందులొ వెలిబుచ్చిన అభిప్రాయాలు , మోడల్స్  విమర్శకుల  సునిశిత పరీక్షలకు గురికావాల్సి ఉంటుందిఆతర్వాత  ప్రభుత్వ యంత్రంగ ఉన్నత స్థాయి ఆమోదం కావాల్సి ఉంటుందన్న విషయం  వ్యాస రచయిత కు తెలుసుప్రస్తుతం ఈ వ్యాసం నుండి రచయిత ఆశిస్తున్నది ఒక చర్చ మాత్రమే వ్యాసాన్ని మొదట ఇంగ్లీషు లో రాద్దామనుకొన్నాను
కానీ ఈ వ్యాస చర్చ లో పై స్థాయినుండి కింది స్థాయి వరకు అందర్ని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో తెలుగులోనే రాద్దామని నిర్ణయించుకొన్నాను
ఇటీవల తెలంగాణా  విశ్వవిద్యాలయం ప్రభుత్వ పాలన శాస్త్ర సిలబస్ ను  పునర్ దర్శించే జాతీయ స్థాయి వర్క్ షాప్ లో  ప్రభుత్వ పాలన శాస్త్ర అధ్యాపకులందరూ ఒక విషయంలో ఎకాభిప్రాయాన్ని వ్యక్త పరిచారు- “ ప్రభుత్వ పాలన శాస్త్రం తన ప్రాధాన్యతను కోల్పోతున్నది”.   అందుకు కారణాలు అనేకం ఉన్నాయిప్రైవేటీకరణం, ప్రంపంచీకరణం, సరళత్వ ధోరణి ఇలా చాల కారణాలు చెప్తున్నారుఈ విషయాన్ని   ఆరోజు అక్కడున్న వారిలొ కొంతమంది అంగీకరించారు కూడా
నా దృష్టి లో, పరిపాలనలొ అన్ని శాఖలలో, అన్ని స్థాయిలలో ఎదురవుతున్న రోజువారి సమస్యలకు పరిష్కారం సూచించాల్సిన బాధ్యత  ప్రభుత్వ పాలన శాస్రానిదేప్రపంచ వ్యాప్తంగా రాజ్యం ఉనికికి ప్రమాదం ఎర్పడిందంటే సహజంగానే రాజ్యాన్ని అంటి పెట్టుకుని కొనసాగుతున్న అన్ని రకాల వ్యవస్థల ఉనికి ప్రమాదంలో పడ్డట్టేఒక రకంగా రాజ్య వైఫల్యం ప్రభుత్వ పాలన శాస్త్ర వైఫల్యమే.  ప్రైవేటీకరణానికి కారణం ప్రైవేటు శక్తుల బలం ఒక్కటే  కాదు. మన బలహీనతలు కూడా ఉన్నాయి. లోతైన తాత్విక అలోచనలు, విశ్వ జనీన వ్యవస్థీకరణ నియమాలు, నిర్వహణ నమూనాల తయారి కి  మాత్రమె పరిమితమయిపోయి క్షేత్రస్థాయిలో జరిగే పాలనా పనులతో మనకు సంబధం లేదనుకుంటే ప్రభుత్వపాలన శాస్త్రం అసంపూర్తిగా మిగిలి పొతుంది. పరిస్థితి ఇలాగే ఉంటుంది. స్థూల స్థాయి నుండి సూక్ష్మ స్థాయి వరకు ఎదురయ్యే అన్నిరకాల సమస్యలకు పరిష్కారాలు సూచించాల్సిన బాధ్యత ప్రభుత్వ పాలనా శాస్త్రానిదేనని గుర్తించాలి  

ప్రభుత్వ పాలన శాస్త్రం పూర్తిస్థాయిలో  స్పర్శించని అనేక కోణాలలో  కార్యాలయ నిర్వహణ (అఫీస్ మానేజ్మెంట్ ) కూడా ఒకటిఉదాహరణకు టోటెన్ హామ్ కార్యాలయ నిర్వహణ గురింఛి చాలా మందికి తెలియదుచివరికి ప్రభుత్వ పాలన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి కూడా ఈ విషయం తెలియదు.     టోటెన్ హామ్ కార్యాలయ నిర్వహణ విధానంలో   చాలా రకాల రిజిస్టర్లు ఉన్నాయి. వాటి గురించిన ప్రస్తావన ఎక్కడా కనపడదు. దాదాపు వంద సంవత్సరాలుగా టోటెన్ హామ్ కార్యాలయ విధానం అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని, నేటికీ  తెలంగాణ మరియు ఆంధ్ర   రాష్ట్రాలలో కొనసాగుతూనే ఉంది. శతాబ్ద కాలంగా  టోటెన్ హామ్ విధానం  మన జీవితాలను ప్రభావిత పరిచింది ఇంకా ప్రభావిత పరుస్తూనే ఉందిఅంతకంటే విచిత్రమయన  విషయం మరొకటి ఉందిఈ గవర్నెన్స్ పేరుతొ మనం కొంత అకడమిక్ పురోగతి సాధించినా అది ఆయా శాఖలు సాధించుకున్న విజయాలు తప్ప ప్రభుత్వ పాలనా శాస్త్రం తరఫున వాటికి  మనం అందించింది ఏమీ లేదు. అంటే టోటెన్ హామ్ విధానం  వచ్చింది, తన పని తాను చేసుకుంటున్నది, ఈ గవర్నెన్స్ ఉప్పెనలో కొట్టుకు పోవడానికి సిద్ధంగా ఉందిఅయినా ప్రభుత్వ పాలనా శాస్త్ర పాఠ్యాంశాలలో దాని ప్రస్తావన ఎక్కడా ఉన్నట్టు లేదువిశ్వ జనీన సూత్రాలు, వ్యవస్థల  తయారీలో పడి మనం క్షేత్ర స్థాయి స్థానిక అవసరాలను పట్టిం చు కోవడంలేదేమో ?

      టోటెన్ హామ్ ( దీన్నే మన ప్రభుత్వ పాలన పరిభాషలో , మాక్స్ వెబర్ చెప్పినబ్యురోక్రసీగా పెర్కొంటాము, లేదా బ్యూరోక్రసీని విశ్వ వ్యాప్త పేరుగా భావిస్తే టోటెన్ హామ్ దాని స్థానిక  నామం )  అఫీస్ మానేజ్ మెంట్ గురించి పూర్తి వివరాలు కావాలంటే ఇక్కడ ఇచ్చిన లింకును క్లిక్ చేయండి(మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వారికి ధన్యవాదాలతో లింక్   (http://persmin.gov.in/otraining/UNDPProject/undp_modules/OfficeMgtAPDLM.pdf )


      సర్ రిచర్డ్ టోటెన్ హామ్ బ్రిటిష్ దేశస్థుడు, .సి. యస్ ఆఫీసర్, అప్పట్లొ నార్త్ ఆర్కాట్ జిల్లా లో పనిచేశాడు. ఈయన ప్రతిపాదించిన ఆఫీస్ మానేజ్ మెంట్ సూత్రాలలో  రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత కాస్త  ఎక్కువే కనిపిస్తుందికానీ చాలా అంశాలు ఇతర  శాఖలకు వర్తించేలా ఉన్నాయి.   ఇతని ప్రతిపాదిత కార్యాలయ నిర్వహణ లో దాదాపు పదిహేను రకాల రిజిస్టర్లు కనిపిస్తాయిమర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వారి పై  డాక్యుమెంట్ లో అతి ముఖ్య మైన క్యాష్ పుస్తకాల ప్రస్తావన లేదుఅయితే ఇందులొ కొన్ని కేవలం రెవెన్యూ శాఖకు మాత్రమే వర్తిస్తాయి. మరి కొన్నింటిని చాలా శాఖలలో పాటించరు. కొన్ని మారుతున్న కాలానికి పనికి రాకుండా పోతున్నాయివాటికి సంబంధిచిన కొన్ని వివరాలు ఇక్కడ టేబుల్ లో ఇవ్వడం జరిగింది





S.No
Name of the Register
Department to which it is Most useful
Other Department
Relevancy in the present context
1
New Case Register
Revenue
No information
No Comment
2
Inward Register
Common to all
Common to all
Need to be changed in view of the Electronic Communication such as e-mail
3
Distribution/Inward Register
Common to all
Common to all
-do-
4
Security Register
Common to all
Common to all
-do-
5
Personal Register
Common to all
Common to all
-do-
6
Fair Copy Register
Big departments
Not common to all
Redundant.
7
Register for Local Delivery
Common to all
Common to all
Redundant.
8
Stamp Register
Common to all
Common to all
Redundant
9
Call Book
Not Common to all
Not Common to all
No Comment
10
Periodical Register
Not Common to all
Not Common to all
No Comment
11
Copy of Application Register
Not Common to all
Not Common to all
No Comment
12
Record Issue Register
Common to all
Common to all
Need to be changed in view of the Electronic Communication such as e-mail
13
Government Suits Register
Not Common to all
Not Common to All
No Comment
14
Pauper Suits Register
Revenue
Not common to all
No Comment
15
1.       Register  for immovable properties purchased by Government in Civil Court Cases
Not Common to All
Not Common to All
No Comment
   
      ఇక్కడ టోటెన్ హామ్ ప్రస్తావన పదే పదే తేవడంలో ఉద్దేశ్యం ఏమిటంటే ఇప్పుడు ఆచరణలొ ఉన్న కార్యాలయ నిర్వహణ విధానాన్ని పునాదిగా చేసుకొనే రాబోతున్న మార్పులకు శ్రీకారం చుట్టాలి. దశల వారిగా అనుకున్న మార్పులను ఆచరణలొకి తేవాల్సి  ఉంటుంది

అనుకున్న మార్పుల తాలూకు లిస్టు( It is only list. Details will follow)
1.  సాధ్యమైనంతవరకు వ్యక్తి (ఉద్యోగి) ని భౌతికంగా వాస్తవ కార్యాలయ ప్రదేశం నుండి, ఆశ్రితుల నుండి వేరుచేయడం Separation of individual(employee)  from his / her Clients / Stakeholders (as far as possible)

           2.  మల్టి టాస్క్ బ్యురోక్రాట్ల  సమూహం (Multi      task          
                              Bureaucrats pool   ) ఏర్పాటు
      
          3.   కామన్ కార్యాలయాల  ఏర్పాటు (Establishment of                           Common Offices)

          4.    ముందస్తు ఆడిట్ ( Pre Audit)

వివరణ:
ప్రస్తుతం  అమలులో ఉన్న విధానం ప్రకారం  పౌరుడు / ఆశ్రితుడు తన అవసరాలకోసం ఆఫీసుల  చుట్టు తిరగాలిఅవినీతికి మూలం ఇక్కడే ఉంది. ఉద్యోగులు  తమ  హోదానుదర్పాన్ని ప్రదర్శించి అశ్రితుడిని ముప్పుతిప్పలు పెట్టి, అతని అవసరాన్ని అమాయకత్వాన్ని సొమ్ము చెసుకొంటారు. అందుకని ఆశ్రితుడినీ, ఉద్యోగిని పరస్పరం ఎదురుపడకుండా అవసరమైన వ్యవస్థల నిర్మాణం జరగాలికానీ అన్ని సందర్భాలలో ఇది సాధ్యం కాక పోవచ్చు. ప్రభుత్వ వైద్యుడు  రోగి పరస్పరం ఎదురు పడకుండా పని జరగదు
    అందుకని సాధ్యమైనంతవరకు ఉద్యోగిని (కాగితం పనిచేసే వ్యక్తిని) వాస్తవ కార్యాలయ క్షేత్రం నుండి తొలగించాలి. అవసరమైతే తప్ప ఆ వ్యక్తి వివరాలు ఆశ్రితులకు తెలియకూడదు.   అటువంటి ప్రయత్నం ఇప్పటికే ప్రారంభమైంది. ‘ మీ సేవషాపులనుండి  ఇప్పుడు ప్రజలకు అందుతున్న సౌకర్యాలు ఈ కోవకే చెందుతాయి. అదేవిధంగా ప్రయాణ రిజర్వేషన్లు ఇలా కొన్ని రకాల సేవలుఆన్ లైన్లో జరుగుతున్నాయి. ఇంకా పాస్ పోర్ట్ జారీ చేయడంలో కొంత ప్రక్రియఆన్ లైన్ఉంటుంది. అసలు ఒక ప్రాంతానికి చెందిన ఆఫీసు పని వేరే ప్రాంతలో జరిగితే ఎలా ఉంటుందిఉదాహరణకు ఒక కంట్రాక్టరు బిల్లు పాస్ కావడానికి, ఆ ప్రాంత ఆఫీసే కావలసిన అవసరం లేకుండా చేయాలిఅదేవిధంగా ఒక ప్రైవేటు స్కూలు ప్రాంభించడానికి పర్మిషన్ అక్కడి విద్యాధికారికి మాత్రమే అధికారం ఉండవలసిన అవసరం లేకుండా చూడాలిఒక వేళ తప్పని సరి అయితే కొన్ని నియమాలకు లోబడి పనిచేయాలి

రెండవది: బహుళ కార్య ఉద్యోగ సమూహం మరియు అన్ని రకాల ఆఫీసులలో జరిగే కామన్ పనులకు, ఉదాహరణకు నెలవారీ వేతన బిల్లులు తయారుచేయడం వంటి పనులకు ఒక కామన్ ఆఫీసును, అందులో పనిచేయడానికి బహుళ కార్య ఉద్యోగ సమూహాన్ని  ( Multi Task Bureaucrats pool) తాయారు చేయడం. ప్రతి డిపార్ట్ మెంట్ లో సంవత్సరం లో ఏదో కొంతకాలం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందిఉదాహరణకు ఎన్నికల సమయంలొ రెవెన్యూ శాఖ, పంచాయిత్ రాజ్ శాఖల  పై పని భారం చాలా ఉంటుందిఅదేవిధంగా  విద్యాశాఖలో పరీక్షల సమయంలో, అడ్మిషన్ల సమయంలో పని ఒత్తడి ఉంటుందిఇలాంటి సమయంలో ఆదుకొవడానికి  కొంత మంది బహుళ కార్య ఉద్యోగ సమూహం పనికి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవెశపెట్టె కొత్త కొత్త స్కీములు సక్రమంగా అమలు  కావడానికి తగినంత, సరైన మానవ వనరులు లేక మూలన పడ్డవి ఎన్నో ఉన్నాయి.    కొద్దిపాటి శిక్షణ తో మనకు అవసరమైనంత మేర ఉద్యోగుల సమూహాన్ని (పూల్) ఏర్పాటుచేసి పని ఒత్తడి ఉన్నప్పుడు వారిని వాడుకొని తరవాత వెరే శాఖలకు వారిని బదిలీ చేయాలివీరు కూడా ఐ. .ఎస్ . ఆఫీసర్ల లాగా ఏ శాఖలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక వీరికి సంబంధించిన సర్విస్ నియమాలు, తాత్కాలిక ప్రాతిపదికాలేక శాశ్వత ఉద్యోగులా? జీత భత్యాలు మొదలైన అనేక అంశాల చర్చ ఉంటుంది. కాని ఈ దశలో అంత వివరణాత్మక చర్చ సాధ్యం కాదు

మూడవది  కేవలం కాగితం పని కోసం (just for Paperwork) ఇన్ని రకాల కార్యాలయాలు  అవసరమా అన్న ప్రశ్న కూడా వస్తుంది కాబట్టి నాలుగైదు ఇంకా ఎక్కువ శాఖలకు కలిపి ఒకే కామన్ కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తే ఎలాఉంటుందో కూడా అలొచించాలి. ఈ విషయంపై విస్తృత స్థాయి చర్చ జరగాలి.

నాల్గవదిప్రీ ఆడిట్”  ఇది కొంత వరకు అక్కడక్కడ  ఇదివరకే  చలామణీలొ ఉందిఉదాహరణకు పార్లమెంటులోఅంచనాల సంఘంనిర్వహించె పని  ఒక రకంగా ప్రీ ఆడిట్ క్రిందకే రావచ్చు.   ఈ సందర్భంలో ప్రతి ప్రభుత్వ కార్యం అమలుకు ముందే  ఆడిట్ కావాలికనీసం పేపరుపై అన్ని సరిగా ఉన్నాయో లేదో చూసే యంత్రాంగం ఒకటి ఉండాలి. ఈ పనిని ఆశాఖలో వారు, ఆ ప్రాంత ఆఫీసులో పనిచేసేవారు కాకుండా వేరే ప్రాంతం వారు ఆడిట్ ను నిర్వహించాలిఅది కూడాఆన్ లైన్లో, గంటల వ్యవధిలో (కేవలం పేపర్ వర్క్ మాత్రమే) పూర్తి కావాలికుల, ఆదాయ  ధ్రువీకరణ పత్రాలు  జారీ చేయడం మొదలుకొని  అన్ని రకాల సివిల్ నిర్మాణ పనులు, కొత్త వస్తువుల కొనుగోళ్ళు, పాతవస్తువుల వేలం ఇలా అన్ని రకాల పనులకు ముందస్తు ఆడిట్ నిర్వహించడానికి అవసరమైన వ్యవస్థల అభివృద్ధి చేస్తే అవినీతిని చాలవరకు అరికట్ట వచ్చుఅవినీతి  జరిగి పోయిన తర్వాత కంటే కొంతవరకైనా ముందే అరికడితే మంచిది.


 కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్యాలయాల లక్షణాలు:

1.   కేవలం కంపూటర్లతొ కూడిన ఒక  ఆఫీసు ఉండాలి.
2.   ఉద్యోగులు ఒక ప్రత్యెక డిపార్ట్ మెంటు కు చెందిన వారు కారు
3.   ప్రత్యేక పనికి శిక్షణ పొందిన ఉద్యోగుల సమూహం ఒకటి ఉంటుంది
4.  రోజువారి (రొటీన్) పనులతో పాటు అన్నిరకాల పనులకు వారు సిద్ధంగా ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా అమలు చేయదలుచుకున్న స్కీములకు విరినే వాడుకొనేలా తీర్చి దిద్దాలి 
5.  అన్ని శాఖలకు తమ సేవలను అందిస్తూ ఉంటారు.
6.  వీరు అందిచే ప్రతి సేవ తప్పని సరిగా ప్రీ ఆడిట్ (ముందస్తు  ఆడిట్)
        కావాలి
7.  ఇక  కాగితం తో జరుగుతున్న  పనులన్నీ డిజిటల్ రూపంలొ జరగాలి 
8.  ఉద్యోగి గుర్తింపు, అశ్రితుడి గుర్తింపు రహస్యంగా ఉంటుందిఅవసరమైతే తప్ప వారి గుర్తింపు (Identity) బహిర్గతం కాకూడదు.
9.  ప్రతిపనికి కొంత ప్రతిఫలాన్ని నిర్ణయించి అతని ఖాతాలోకి నేరుగా జమచెయాలి.
10.             వీరి సంబందించిన సమయపాలన నియమాలు, ఇతర సర్విసు నియమాలు  పూర్తిగా వేరుగా ఉంటాయి
11.             వీరికి అప్పగించిన పనులు సాధారణంగా గంటల వ్యవధిలో పూర్తికావాలి

గతంలోనే విన్నవించిన ట్లుగా ఈ నియమాలు, సూత్రాలు, మాడల్స్ మేధావుల, అనుభవజ్ఞుల సునుశిత  పరిశీలన, విమర్శలకు గురికావాలి.
కోట్లాది మంది ప్రజలకు చెందిన ఒక వ్యవస్థ, వంద సంవత్సరాలుగా కొనసాగుతున్నపద్దతులను ఒక వ్యక్తి, ఒక్కసారిగా మార్చలేడుకానీ ప్రతి పెద్ద పని  చిన్నచిన్న పనులతోనే  ప్రారంభమౌతుంది. ఇదీ అలాంటి ప్రయత్నమే.    


ప్రారంభ ప్రయత్నం:

ఏదో ఒకటిరెండు విశ్వ విద్యాలయాల్లొ కానీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కానీ ఒక షార్ట్ టర్మ్ కోర్సును  ప్రవేశపెట్టాలిఆ కోర్సు లో ప్రస్తుతం అమలులో ఉన్న ఆఫీసు  విధానం తో పాటు, రాబోతున్న మార్పులకు అనుగుణంగా బహుళ కార్య  ( మల్టీ టాస్క్) నైపుణ్య విధానంలో శిక్షణ కు కోర్సు ను డిజైన్ చెయాలిఇందుకోసం    అకడమిషయన్ల తో పాటు పాలన లో అనుభవం ఉన్న వారిని భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాలన శాస్త్ర విద్యార్థులు, మేధావులు ఇందులో చురుగ్గా పాల్గొంటే మంచిదిథియరీతో పాటు ప్రాక్టికల్ జ్ఞానం కూడా వారికి లభిస్తుందని నా నమ్మకం.

                          మీ విమర్శలకై ఎదిరి చూస్తూ 

                                                        మీ 
                                                 ప్రదీప్ కుమార్ 
                                                9849609959
                                    jayadeep.kulkarni@gmail.com




కామెంట్‌లు లేవు: