పేజీలు

3, జులై 2016, ఆదివారం

బట్టి సదువులు


దోస్తులందరికీ  నమస్కారం 
 వారమయింది మిమ్మల్ని  పల్కరిచ్చి.  మీ అందరికి తెల్సు మన సదువులు ఎంత గొప్పవో.  మొన్న కేసీఆర్ మాటలు ఇన్న.  ఎవ్వల్లో వాట్సాప్ ల పోస్ట్ చేసిండ్రు.  బి. టేక్  సదివిన పిల్లలు ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన ల పనిజేస్తున్నారట.  దీన్నేట్ల అర్ధం జేసుకోవాల్నో సమజయితలేదు.  బి.టెక్ వాల్యూ వడిపోయిందా? లేక   ప్రదాన మంత్రి రోజ్గార్ యోజన  వాల్యూ పెరిగిందా? నాకు తెలిసినంత మట్టుకు మొదటిదే కరెక్ట్ అనిపిస్తున్నది. ఎందుకంటే  ఇంజనిరింగ్ పిల్లలకు కొలువులు దొరకక రోడ్ల మీద తిరుగుతున్నరు.  మొన్న బస్సుల నా పక్క సీట్ల ఒక ఇంజనీరు కాలేజీ పంతులు కూసున్నడు.  ఆయన మాటలు ఇంటే  ముందు కోపమొచ్చింది తర్వాత నవ్వొచ్చింది.  బి.టెక్  పాసైనా ఆయనకు కొలువు దొరకలేదట.  అందుకని  సర్కారు ను తిడుతుండు.  అమెరికా కు వోనికి  పైసల్లేవు.  ఈడ  సర్కారు నౌకరు జూపిస్తలేదు.  ఇగ ఎట్ల  బతకాల ?  అది ఆయన బాధ.  సర్కారీ నౌకరీయే గావాల  ప్రయివేటు నౌకరి పనికిరాదాయె! అందుకని ఎంజేయాలో తెల్వక ఏదో ఇంజనీరింగ్ కాలేజీల పంతులు ఉద్యోగం జేస్తున్నడట. నేనేమన్న అంటే  నీకే కొలువు లేక పోతే నీదగ్గర సదువుకున్నోడి కి  ఎవ్వడియ్యాల  నౌకరి? నువ్వేమో ప్రతీ యేటా  యాభయి మంది ఇంజనీర్లను తయారు జెసి అల్లను దేశం మీదకు తొల్తవు మరి ఆల్లందరికి కొలువులు యాడికెల్లి రావాల ? దానికి ఆ పంతులు తానా  జవాబు లేదు.  పదిమందికి నౌకరి సూపిచ్చే సదువుంది  నీ తాన.  నీకు ఎవడో ఇచ్ఛే నౌకరి ఔసరమా   అనడిగితే సప్పుడు జెయ్యలేదు.  ఇదంతా ఎందుకు చెప్తున్నంటే , మనం సదివిన సదువులు మన కాళ్ళ మీద మనను నిలవెట్టకుంటే ఆ సదువులెందుకు మన్ను బుక్కనా ? పాస్ మార్కుల మందం బట్టి వెట్టిన సదువులు మనకు బువ్వ వెట్టవు.  అన్నట్టు బట్టి వెట్టుడు అంటే  యాదికచ్చింది  బట్టి వెట్టి సదివిన సదువుకు  నఖలు గొట్టి పాసైన  సదువుకు ఏమన్న తేడా ఉన్నదా ?   నాకైతే ఎంగనిపిస్తలేదు.  కాని మన పిల్లలేమో దన్క బట్టి కెగ వడ్ఢరు.  మార్కుల మాయల వడి అసలు  చదువు సదువుతలేరు.  అందుకేనేమో కేసీఆర్ కొన్ని ఇంజనిరింగ్ కాలేజీలను బంజేపిచ్చిండు.   మల్ల ఇప్పుడేమో కొత్త సదువుల  పాలసీ అంట  మోడీ సర్కార్